పోలవరం ప్రాజెక్టు బిల్లులో 18వందల 50 కోట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో నుంచి ఈ బిల్లు విడుదలకు నిర్ణయం తీసుకుంది. త్వరలో నాబార్డు నుంచి ఈ నిధులు విడుదల కానున్నాయి. రూ.5,600 కోట్లు రావాల్సిన బిల్లులో రూ.3 వేల కోట్ల వరకు ఆమోదం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరికొంత పరిశీలన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని వివరణలు కోరే అవకాశమున్నట్లు సమాచారం. ప్రాజెక్టుకు తొలుత ఖర్చు చేసిన బిల్లులను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపుతోంది.
ఇవీ చూడండి-పోలవరంపై.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు