ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రతిని దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు(Highcourt) ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎస్‌ఈసీ(SEC)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు(Highcourt)లో పిటిషన్ దాఖలైంది. తాజాగా జరిగిన విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పోస్టులు నిర్వహించిన వారు ఎన్నికల కమిషనర్‌గా అనర్హులని... స్వతంత్ర వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాదబాబు వాదనలు వినిపించారు. తీర్పును కోర్టు ముందు ఉంచుతానన్నారు. దీంతో తీర్పు ప్రతిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది.
ఎస్ఈసీ(SEC)గా నీలం సాహ్ని ఎన్నిక.. రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పేర్కొంటూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టు(Highcourt)లో పిల్ వేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎస్ఈసీ నీలం సాహ్ని రూ.160 కోట్ల ప్రజాధనం వృథా చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని కోరారు.
ఇదీ చదవండి: పసిడి ధర పెరుగుతుందా? పెట్టుబడి పెట్టొచ్చా?