ETV Bharat / city

‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం - గుంటూరులో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిరసన

వేల మంది ఒక్కటై కదిలారు.. రాజధాని గ్రామాల రైతులు, ప్రజలు, వారికి మద్దతిస్తున్న పార్టీలు, సంఘాల ప్రతినిధులు మెడలో ఆకుపచ్చని కండువాలు.. చేతిలో రెపరెపలాడే జెండాలతో పోరుబాటన సాగారు. ‘జై అమరావతి’ నినాదాలతో రాజధాని వీధుల్ని హోరెత్తించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినదించారు. రాజధాని అమరావతికి సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి గురువారం మహా పాదయాత్ర నిర్వహించారు. అక్కడే వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. ‘మోదీజీ’ మీరే అమరావతిని కాపాడాలంటూ వేడుకున్నారు.

People protest in the streets of the capital with the slogans 'Jai Amravati'
‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం
author img

By

Published : Oct 23, 2020, 6:51 AM IST

ఐదేళ్ల క్రితం ప్రజల ఆనందోత్సాహాలు, కేరింతలతో నిండిన అదే ప్రాంతం.. గురువారం ఉద్యమ నినాదాలతో దద్దరిల్లింది. ఉద్దండరాయునిపాలెం వద్ద అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వరకు గురువారం అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ‘రాజధాని పరిరక్షణకు- ఆంధ్రుల అమరావతి పాదయాత్ర’ను నిర్వహించారు. శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ‘నాటి వైభవం- నేటి దుస్థితి’ పేరుతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు 44 కిలోమీటర్ల దూరం మహా పాదయాత్ర నిర్వహించారు. మరోపక్క రాజధాని గ్రామాల ప్రజలు, రైతుల్లో కొందరు రాయపూడికి, మరికొందరు మందడం గ్రామానికి చేరుకుని.. శంకుస్థాపన ప్రదేశం వరకు పాదయాత్ర నిర్వహించారు. దీనికి మద్దతుగా ‘దగాపడ్డ అమరావతి రైతుబిడ్డ’ పేరుతో రాజధానికి భూములిచ్చిన ఎస్సీ రైతులు ర్యాలీ చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు నుంచి శంకుస్థాపన ప్రదేశానికి ర్యాలీగా వచ్చారు. పాదయాత్రలు, నిరసనల్లో భాజపా, జనసేన మినహా... తెదేపా, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, నవతరం తదితర పార్టీల నాయకులు, దళిత బహుజన ఫ్రంట్‌ సహా వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించేందుకు సహకరిస్తామని శంకుస్థాపన సమయంలో మాటిచ్చిన ప్రధాని మోదీ.. జోక్యం చేసుకుని ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయేతర జేఏసీ, రైతు ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7.50 గంటలకు గుంటూరులోని లక్ష్మీపురం సెంటర్‌లో ఉన్న మదర్‌ థెరిసా విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో వంద మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని పోలీసులు బుధవారం రాత్రే ఉద్యమకారుల్ని హెచ్చరించారు. దాంతో పరిమిత సంఖ్యలోనే పాదయాత్రలో పాల్గొన్నారు. పోలీసులు తాడు పట్టుకుని, దానికి లోపలే యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారు... ప్రధాని మోదీ చిత్రపటంతో కూడిన భారీ కటౌట్‌ను, రాజధాని శంకుస్థాపన ఘట్టాల చిత్రాలతో కూడిన ఫొటోలను ట్రాక్టర్‌పై ఉంచి యాత్ర కొనసాగించారు. మోదీ ఫొటో ఉన్న టీ షర్టులు ధరించారు. గోరంట్ల, లాం, తాడికొండ అడ్డరోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు మీదుగా పాదయాత్ర సాగింది. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, న్యాయవాదులు పాదయాత్రలో చేరారు. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు, ఐకాస ప్రతినిధులు ఎదురొచ్చి వారితో పాటు కొంతదూరం నడిచి మద్దతు తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, తెదేపా నాయకులు వర్ల రామయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్‌, మన్నవ సుబ్బారావు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధి గద్దె తిరుపతిరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రైతుల భారీ పాదయాత్ర

మందడం, రాయపూడి గ్రామాల నుంచి పొంగళ్లు, సర్వమతాల దేవతా చిత్రపటాలున్న ప్రభలతో వేర్వేరుగా రాజధాని రైతులు, ప్రజలు పాదయాత్ర నిర్వహించారు. తుళ్లూరు, దొండపాడు, పెదపరిమి, బోరుపాలెం, అనంతవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు రాయపూడికి చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, రాజధాని ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఐనవోలు, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం తదితర గ్రామాల రైతులు మందడం చేరుకుని పాదయాత్రగా బయల్దేరారు. రాజధాని ఉద్యమాన్ని మొదటి నుంచీ ముందుండి నడిపిస్తున్న మహిళామణులు హరితవర్ణ చీరలు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. కొందరు చిన్నారులు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత గ్రామాల్లో మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభమైనప్పుడు రైతులు వందల్లోనే ఉండగా.. ఉద్ధండరాయుపాలెం చేరుకునేసరికి అది వేల సంఖ్యకు చేరింది.

29 గ్రామాల్లో కాగడాల ప్రదర్శన

రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు రాజధాని గ్రామాల్లోని దీక్షాశిబిరాల ముందు రైతులు, మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దీక్షా శిబిరాల్లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం దుర్గమ్మను బాలాత్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

మోదీ మాస్క్‌లతో నిరసన

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీపైనే ఉందని చెబుతూ.. ‘అమరావతి రైతుల చూపు- మోదీ వైపు’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, అమరావతి ఐకాస నేతలు రైతులు, మహిళలు, చిన్నారులు ముఖాలకు మోదీ మాస్కులు ధరించి నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మనసు మారాలంటూ రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన మతపెద్దల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేశారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు. రాజధాని గ్రామాల్లోని దీక్షాశిబిరాల్లో ఆందోళనలు కొనసాగించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల నుంచి సేకరించిన నీరు- మట్టితో శంకుస్థాపన ప్రదేశంలో పూజలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ప్రార్థిస్తూ అఖిల భారత హిందూ మహాసభ, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘మహారుద్రయాగం’ నిర్వహించారు.

ఇదీ చదవండి:

ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.