..
పురివిప్పి నెమలి నాట్యం... మనసును దోచే దృశ్యం..! - peacock dance video in medak
Peacock Dance: అడవిలో ఉండే నెమలి రోజూ గ్రామంలోకి వచ్చి నాట్యం చేస్తే చూపరులకు ఎంత ఆనందమో కదా.. అలాంటి దృశ్యమే తెలంగాణలోని మెదక్ జిల్లాలో తరచుగా దర్శనమిస్తోంది. నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఓ మయూరం అప్పుడప్పుడు అడవి నుంచి వచ్చి గ్రామ వీధుల్లో నాట్యం చేసి వెళ్తోంది. తరచు వస్తున్నా ఆ నెమలితో గ్రామస్థులు కాలక్షేపం చేస్తున్నారు.. మనుషులు దానికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకపోవటంతో గ్రామంలోకి వచ్చి ఉల్లాసంగా కాసేపు గడిపి అడవులోకి వెళుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పురి విప్పి వయ్యారాలు పోతూ నృత్యం చేసి ప్రకృతికి మరింత అందాన్ని అద్దింది. ఆ నెమలి నాట్యాన్ని అక్కడివారు వారి చరవాణుల్లో బంధించారు.
పురివిప్పి నెమలి నాట్యం
..