కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి మొండిచేయి మాత్రమే మిగిలిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ భారత జాతికి వ్యతిరేక బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీలా మాత్రమే ఉందన్నారు.
కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉపాధి కల్పించే ప్రతిపాదనలు బడ్జెట్లో లేవన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే 23 మంది ఎంపీలు ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా నిధులు, విభజన హామీలు, విజయవాడ, విశాఖ మెట్రో రైలు గురించి ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి: పోలవరానికి రూ.2234.20 కోట్లు.. కేంద్రం వెల్లడి