ETV Bharat / city

మంత్రి హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా?: రేవంత్​రెడ్డి - రేవంత్​రెడ్డి వార్తలు

Revanth reddy: తెలంగాణ మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై హత్య కుట్రలో నిజానిజాలు బయటికి రావాలంటే జుడిషియల్​ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై ఎలక్షన్ అఫిడవిట్ వ్యవహారం విచారణలో ఉండగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

Revanth reddy
Revanth reddy
author img

By

Published : Mar 3, 2022, 10:31 PM IST

మంత్రి హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా: రేవంత్​రెడ్డి

Revanth reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా..? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై ఎలక్షన్ అఫిడవిట్ వ్యవహారం విచారణలో ఉండగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉండగా పోలీసులు మీడియా ముందుకొచ్చి ఎలా మాట్లాడుతారని నిలదీశారు. డీజీపీ సెలవుపై వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే చెప్పానని రేవంత్​ రెడ్డి అన్నారు. డీకే అరుణ, జితేందర్​రెడ్డి ఇళ్లపై దాడులు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రిపై హత్య కుట్రలో నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర జుడిషియల్​ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

హైదరాబాద్​ గాంధీభవన్​లో కిసాన్​ కాంగ్రెస్​ సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్ పాల్గొన్నారు. ఈ భేటీలో పంటల కొనుగోలు, పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు, ధరణి సమస్యలు, రైతుల కష్టాలు, రుణమాఫీపై చర్చించినట్లు రేవంత్​రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్ల.. రాష్ట్రంలో వరి కొనుగోళ్లలో గందరగోళం తలెత్తిందని ఆరోపించారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే రైతుల ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. రైతులను.. మిల్లర్లు ఇప్పుడే బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని చెప్పారు. ఈనెల 5న సివిల్ సప్లై కమిషనర్​ను కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. యాసంగి వడ్ల కొనుగోళ్లలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.

నాడు టికాయత్​ ఎందుకు గుర్తుకురాలేదు..

దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేసిననాడు సీఎం కేసీఆర్​కు టికాయత్​ గుర్తుకురాలేదని రేవంత్​ అన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్.. దిల్లీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమేనని రేవంత్​ విమర్శించారు.

డీజీపీ ఎంత ఒత్తిడిలో ఉన్నారో..

డీజీపీ ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలియదన్న రేవంత్‌ రెడ్డి.. ఆయన ప్రకటన విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీజీపీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించడంలేదని నిలదీశారు. మరోవైపు రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఎనిమిది సంవత్సరాలుగా ఇంకా పరాయి పాలనలో రాష్ట్రం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన శాఖలన్నీ బిహారీ అధికారుల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాధరణకు గురవుతున్నారని రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. ఒక్కో శాఖకు ఒక్కో అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీచూడండి: TS News: తెలంగాణలో మంత్రి హత్యకు సుపారీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.