అరటి, కర్బూజా, పుచ్చకాయ రైతులను ఆదుకోవాలని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కోరారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన... 2-3 రోజుల్లో పంట కోతలు జరపకపోతే పూర్తిగా నష్టం వాటిల్లుతుందన్నారు. మరోవైపు... ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల ఆర్థికసాయం ఇంకా చాలామందికి అందాల్సిన అవసరముందని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు
ఇదీ చదవండి :