కులతత్వం, కుటుంబపాలనతో నిండిన వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పవన్ అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే ఏపీకీ మంచిదనే 2014లో మోదీకి మద్దతిచ్చామన్నారు. ఆ తర్వాత కొంత అంతరం ఏర్పడిందన్నారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడారు. అప్పటి లోపాలు సరిదిద్దుకుని కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించామని పవన్ తెలిపారు. ఈ నిర్ణయంపై భాజపా కేంద్ర నాయకత్వం కూడా పూర్తిస్థాయిలో సుముఖత తెలిపిందన్నారు. గత ఐదేళ్ల తెదేపా పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. అంత పెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పానన్న పవన్... 33 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించానన్నారు. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాప్రయోజనాల కోసమే భాజపాతో కలిసి పనిచేస్తుస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో భాజపా కోసం పనిచేసేందుకు అంగీకరించానని పవన్ స్పష్టం చేశారు.
హైకోర్టు పెడితే రాజధాని అవదు : పవన్
హైకోర్టు పెట్టి రాయలసీమకు రాజధాని ఇచ్చామంటే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కులతత్వం, కుటుంబపాలన, అవినీతి పోవాలన్నారు. అమరావతి తరలించడం కుదరదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. బలం ఉందని ఇష్టం వచ్చినట్లు చేయడం సరికాదన్నారు. మొండిగా ముందుకెళ్తే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని తెలిపారు. రాజధాని తరలించేస్తా అని జగన్ అనగానే అయిపోతుందా అని పవన్ ప్రశ్నించారు. ఇళ్లు మార్చినట్లు రాజధానులను మారుస్తారా అని నిలదీశారు. 3 రాజధానుల మాట రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమే అని పవన్ అన్నారు. ఒక ఊరిలో హైకోర్టు పెడితే దానిని రాజధాని అనరని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై
ఏపీకి ప్రత్యేక హోదాపై ముందు నుంచి స్పష్టతతో ఉన్నానని జనసేన అధినేత పవన్ అన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తారన్న నమ్మకం తనకుందని పవన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాపై తన కంటే తెదేపా, వైకాపాను ప్రశ్నించాలని అన్నారు.
ఇదీ చదవండి :