సర్వేజనా సుఖినోభవన్తు అన్న విధానంతో పాలకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన జనసేన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
పాలకులు చేసిన తప్పులకు ప్రజలు బాధపడటం సరికాదని పవన్ అన్నారు. అందుకే.. ప్రజలంతా హాయిగా బతికే బహుజన విధానం రావాల్సి ఉందని చెప్పారు. తెలుగురాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
మున్సిపల్ రిజల్ట్: ఇప్పటి వరకూ.. ఎక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?