ETV Bharat / city

ముస్లిం సోదర, సోదరీమణులకు.. పవన్‌కల్యాణ్‌ రంజాన్ శుభాకాంక్షలు

author img

By

Published : May 13, 2021, 4:38 PM IST

ముస్లిం సోదర, సోదరీమణులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేలా ప్రార్థనలు చేయాలని కోరారు.

pawan kalyan ramjan wishes
పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు

ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల మేలు కలయిక.. పవిత్ర రంజాన్ మాసమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రతి ముస్లిం సోదరుడు, సోదరీమణికి.. తన తరఫున, పార్టీ పక్షాన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెలపాటు నిష్టతో ఉపవాసాలు చేసిన వారి దీక్ష గొప్పదని కొనియాడారు. ఈ పవిత్ర మాసం.. మనిషి జీవనానికి ఒక క్రమశిక్షణ అలవరుస్తుందని, కష్టాల్లో ఉన్న తోటివారికి సాయం చేసి ఆదుకొనే సద్గుణాన్ని నేర్పుతుందన్నారు.

ఇదీ చదవండి: 'సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధం'

ప్రస్తుతం కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న వేళ.. నిబంధనలు అనుసరించి పండగు చేసుకోవాలని పవన్ కోరారు. మత పెద్దల సూచనలు అనుసరిస్తూ.. తగు జాగ్రత్తలతో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. మానవాళికి కొవిడ్ పీడ త్వరగా వీడిపోయేలా ప్రార్థించాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.