People Suffering Due to Damaged Roads in Prakasam District : గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు గోతులు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు గోతులు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు.
రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయం : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ముండ్లమూరు - తాళ్లూరు, తాళ్లూరు- తూర్పుగంగవరంల మధ్య ఉన్న రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇరుకైన తారు రోడ్డు కాస్తా గుంతల దారిగా మారిపోయింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం ముండ్లమూరు - తాళ్ళూరు మధ్య 9 కిలోమీటర్ల రహదారికి నిధులు మంజూరు చేసింది. దాదాపు 7.5 కిలోమీటర్ల పని అయిపోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన పని నిలిచిపోయింది. 1.5 కి.మీ రహదారిని కనీసం పట్టించుకోలేదు. మరోవైపు తాళ్ళూరు - తూర్పు గంగవరం రహదారి 6 కిలోమీటర్లు పూర్తి చెయ్యలేదు. మొత్తం గుంతలమయం అయ్యింది.
ఇవేమి రోడ్లు బాబోయ్ - అడుగుకో గుంత, గజానికో గొయ్యి - Damaged Roads in Srikakulam
రోడ్డు మొత్తం గుంతలమాయం. వర్షం వస్తే చాలు ఎక్కడ గుంత ఉంటాదో తెలియక చాలా మంది కింద పడిపోతున్నారు. ఈ గుంతలు పూడ్చాడానికి గతంలో టెండర్లుకు పిలిచారు. కానీ కాంట్రాక్టర్కు సొమ్ము చెల్లించకపోవడంతో వారి పనులు మొదలు పెట్టలేదు. కనీసం కూటమి ప్రభుత్వమైన రోడ్లు బాగుచేయాలని కోరుకుంటున్నాం - స్థానికులు
నరక ప్రయాణంగా రహదారి : తాళ్లూరు, తూర్పు గంగవరం మధ్య రహదారికి రెండు కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గుత్తేదారుడు బిల్లులు రావనే ఉద్దేశంతో పనులు చేయలేదు. రహదారి మొత్తం మీద 167 గుంతలు ఉన్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలు నిత్యం తిరిగే రోడ్డుపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. కూటమి ప్రభుత్వమైనా పనులు ప్రారంభించి ఇబ్బందులు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్రంలో రహదారులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - 100 రోజుల యాక్షన్ ప్లాన్ - 100 Days Action Plan for Roads