ETV Bharat / city

వైకాపా పాలనకు చరమ గీతం పాడాలి.. ఆ పార్టీ అంటే అందుకే చిరాకు: పవన్​ - పవన్​ కల్యాణ్ వార్తలు

వైకాపా పాలనకు చరమగీతం పాడాలన్నారు జనసేన అధినేత పవన్​ కల్యాణ్. కిందిస్థాయి నేతలు పార్టీ అధినేతను మించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వైకాపా అంటే అందుకే చిరాకు అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేస్తున్నందుకు వైకాపా నేతలు తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని పవన్ ఆరోపించారు.

పవన్
పవన్
author img

By

Published : Jul 11, 2022, 4:50 AM IST

రాష్ట్రంలో వైకాపా నాయకులు పేదలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, వారి ఆస్తుల దురాక్రమణకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వైకాపా, ఆ పార్టీ నేతల తీరుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక గొడుగు కిందకు వచ్చి గ్రామ స్థాయి నుంచి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. విజయవాడలోని ఎంబీకే భవన్‌లో 'జనవాణి.. జనసేన భరోసా' పేరిట ప్రజల నుంచి రెండో విడత వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రకాశం, తిరుపతి, గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన సుమారు 485 మంది బాధితుల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. వృద్ధులు, వికలాంగులు వస్తే వారిని కుర్చీలో కూర్చోబెట్టి.. మోకాళ్లపై కూర్చుని వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని వివిధ శాఖలకు పంపి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం 10.30కు కార్యక్రమాన్ని ప్రారంభించి.. సాయంత్రం 5.10 వరకూ ఫిర్యాదులు స్వీకరిస్తూనే ఉన్నారు. అయినా బయట వందల సంఖ్యలో ఫిర్యాదులు అందించడానికి నిలబడి ఉన్నారు.

"వైకాపా కిందిస్థాయి నేతలు పార్టీ అధినేతను మించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు.. రెవెన్యూ అధికారులు.. కోర్టులు సహకరించకుంటే ప్రజలు ఏం చేయాలి? వైకాపా అంటే అందుకే చిరాకు. ఒక నాయకుడు దౌర్జన్యాలు చేస్తే భరించగలం. ఆ నాయకుడి లక్షణాలు ప్రతి గ్రామం.. పంచాయతీకి వెళ్తే ప్రతిచోటా మినీ వైకాపా అధినేత అక్కడ ఉంటాడు. విశాఖలో కొండలన్నీ వైకాపా నేతలు మింగేస్తారని అప్పట్లో చెప్పాను. నాకు తెలిసిన ఒక స్టూడియో యజమానికి ఫోన్‌ చేసి.. అన్నయ్యకు స్టూడియో నచ్చిందని.. మీరు అమ్మాల్సిందేనని బెదిరించారు. వీటిని అంతా కలిసి ఎదుర్కొని వైకాపా పాలనకు చరమగీతం పాడాలి"

-పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

ప్రముఖ హిందీకవి రాంధారీ సింగ్‌ దినకర్‌ చెప్పిన 'సింహాసనాన్ని ఖాళీ చేయండి.. ప్రజలు వస్తున్నారు' అనే మాటలను, లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఎమర్జెన్సీ కాలంలో పట్నాలో చెప్పిన మాటలను ప్రస్తావించారు.

.

మా సీఎం నవ్వితే చాలు
'వైకాపా నేతలపై చిన్నపాటి విమర్శ చేసినవారంతా వారికి కౌరవులుగా కనిపిస్తారు. వారికి తెలియని విషయం ఏంటంటే కౌరవులు రాజ్యాధికారంలో ఉండి.. పాండవులకు అధికారం లేకుండా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు.. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాళ్లు ఎదురుదాడికి దిగడమేంటి? కోడికత్తితో పొడిపించుకున్న వారే.. ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేయడమేంటి? ఇవన్నీ ప్రశ్నిస్తే కౌరవులంటూ వైకాపా ప్లీనరీలో విమర్శిస్తున్నారు. వివిధ కులాలకు చెందిన మంత్రులు వారి వర్గాల ప్రజలను అభివృద్ధి చేసే పరిస్థితి ఇక్కడ లేదు. మంత్రులంతా కలిసి.. మా సీఎం నవ్వితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు' అని విమర్శించారు.

'కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన ఒక కులానికి చెందినవారు కాదు. భరతజాతికి చెందిన వారు. అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెట్టి.. ఆయన పేరిట ఉన్న అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకాన్ని ప్రభుత్వం ఎందుకు రద్దుచేసింది? ఇలా ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దుచేసి.. ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టినంత మాత్రాన ప్రయోజనం ఏంటి?’ అని ప్రశ్నించారు.

.

ముద్దులు పెట్టింది ఇందుకా?
"ప్రజాసమస్యలను ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదు. జనవాణి అనేది ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యక్రమం. బాధ్యత మరచిపోయిన వైకాపా ప్రభుత్వానికి బాధ్యతగా ఎలా పనిచేయాలో గుర్తు చేయడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పాదయాత్ర సమయంలో విద్యుత్‌ ఒప్పంద ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా కాకుండా విద్యుత్‌ సంస్థ ద్వారా నేరుగా జీతాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఏమైంది? తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఒప్పంద ఉద్యోగులకు నేరుగా జీతాలిచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. ఇదే కాదు.. ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మోసం చేసింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఒక వృద్ధురాలిని వైకాపా ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీ కలిసి దౌర్జన్యంగా రోడ్డుపైకి ఈడ్చేసి.. ఇంటిని ఆక్రమిస్తే అక్కడి అధికారులు వారికి అండగా నిలవలేదు. ఇలా చేయడం భావ్యమా? సీఎంగా మీకు తెలియదా? ఇందుకా పాదయాత్రలో చేతులు నిమిరి.. ముద్దులు పెట్టింది? వారి ఇంటిని తిరిగి ఇవ్వాలి. లేకుంటే నేనే వచ్చి వారికి అండగా ఉంటా" అని బాధితురాలు అనితకు, ఆమె తల్లికి భరోసా ఇచ్చారు.

.

నా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు
'రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పోరాటం చేస్తున్నాను. అందుకు నా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు. నా సినిమాలను ఆపేస్తున్నారు. అయినా భయపడేది లేదు. కులాలు.. మతాలుగా ఓటర్లను విడదీసి పార్టీలు లబ్ధి పొందితే.. దీనివల్ల సామన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాపులకు రిజర్వేషన్‌, కాపు కార్పొరేషన్‌కు నిధులు కూడా సరిగా ఇవ్వకుండా ఆ వర్గాన్ని కూడా ప్రభుత్వం మోసం చేసింది' అని పవన్‌ అన్నారు.

'జనవాణిలో 485 ఫిర్యాదులు అందాయి. అందులో వివిధ సమస్యలు.. సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు నా దృష్టికి తెచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాని విద్యార్థులు.. రోడ్లు సరిగా లేవని చెప్పినవారు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి సౌకర్యం లేదని చెప్పారు. 14 లక్షల టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా నిలిపేశారు. అన్యాయం జరిగిందని బాధితులు గొంతెత్తితే.. పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను సరిగా వినియోగించుకోకుంటే.. భవిష్యత్తులో అదొక మాఫియాలా తయారయ్యే ప్రమాదం ఉంది' అని హెచ్చరించారు.

  • జనవాణి కార్యక్రమాన్ని వచ్చే ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

కేశ సంపద చాలా విలువైంది
'ఏదైనా ప్రజాసమస్యపై మాట్లాడితే ఒక్కొక్కరూ పూనకాలు వచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడతారు. కేశ సంపదను చాలా విచిత్రంగా వాడుతున్నారు. వయసు వచ్చాక ఎలాగూ ఊడిపోతుంది.. జాగ్రత్త. అందుకే ఎక్కువ కేశసంపదను పీక్కోవద్దని చెబుతున్నా. ప్రతిసారీ మీ కేశాలకు పనిచెబితే.. ప్రజలే త్వరలో వాటిని పూర్తిస్థాయిలో పీకే పనిలో ఉంటారు' అని వైకాపా నాయకత్వాన్ని ఉద్దేశించి పవన్‌ వ్యంగ్యంగా మాట్లాడారు.

కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు..

  • ఇతర పార్టీల తరఫున సర్పంచులు గెలిచిన పంచాయతీలకు నిధులు రావటం లేదు. దాదాపు 13వేల పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ జయంతిరోజు పాలాభిషేకం చేయడమా?
  • మణికంఠ అనే వ్యక్తి పవన్‌కల్యాణ్‌ నచ్చాడని ఫేస్‌బుక్‌లో పెడితే.. కక్షగట్టి అతని పింఛను ఆపేశారు. సుమారు 3 వేల మంది దివ్యాంగులకు పింఛను నిలిపేశారు. నడవలేని వారిని కూడా దివ్యాంగుడిగా ధ్రువీకరణ అడగడం ఏంటి?
  • గత మార్చిలో సీఆర్‌డీఏ రైతుల కౌలు విషయమై మాట్లాడితే.. రెండు నెలలు కౌలు చెల్లించారు. మళ్లీ చెల్లించలేదని బాధిత రైతులు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థ పనిచేసే తీరు ఇలాగేనా?
  • గత ప్రభుత్వహయాంలో చంద్రన్న బీమా పథకం ఉంటే.. దాని పేరు మార్చి వైఎస్‌ఆర్‌ బీమా పథకం అని పెట్టినా పాత విధానం కొనసాగాలి. 2015-19లో 25 లక్షల కుటుంబాలకు రూ.3వేల కోట్లు బీమా పరిహారం కింద అందింది. 2019-22 వరకు ఇచ్చిన బీమా రూ.65 కోట్లు. మూడేళ్లలో 3,375 మందికే పరిహారం చెల్లించారు. రూ.145 కోట్ల ప్రీమియం చెల్లించి.. బాధితులకు ఇచ్చింది రూ.65 కోట్లేనా? గతంలో ప్రభుత్వ బీమా కంపెనీ ద్వారా చెల్లిస్తే.. ఇప్పుడు మధ్యవర్తిని ఏర్పాటుచేసి ప్రైవేటు కంపెనీకి ఇచ్చారు. బీమా నిధి ఎటు వెళ్తోందో ఎవరికీ తెలియడం లేదు.
  • భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.918 కోట్లు వారు వినియోగించుకోలేని పరిస్థితి. మూడేళ్లలో కార్మిక దినోత్సవాన్ని నిర్వహించడం కూడా ప్రభుత్వం మరచిపోయింది.
  • గతంలో రూ.6వేలకు దొరికే ఇసుక.. ఇప్పుడు రూ.30 వేలు అయ్యింది.
  • దాతల ద్వారా ఏర్పాటైన ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వం సాయం అందించాలి. అవి కూడా మూసేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదు.
  • బాలింతలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషకాహారాన్ని ఇళ్లకు పంపాలి. గత నెల నుంచి మీరే వచ్చి తీసుకోవాలని.. అలా కాకుంటే ప్రసవం తర్వాత కిట్‌ కూడా ఇచ్చేది లేదని చెప్పడంలో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటి?
  • చేనేత కార్మికులకు కేంద్రం ఇచ్చిన పవర్‌లూమ్‌ల కారణంగా వారి విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటుతోంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు వారికి అందటం లేదు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి.
  • వైకాపా నేతల అండతో ప్రకాశం జిల్లాలో సెనగ రైతుల్ని మోసం చేసి.. రూ.కోట్లు దోచేసిన వ్యాపారి నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని మహిళా రైతులు కన్నీటితో విన్నవించారు.

ఇదీ చూడండి: రాష్ట్రాన్ని దోచుకుంటున్న దుష్టచతుష్టయం: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.