కరోనా ఉద్ధృతి సమయంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అన్నారు. తక్షణమే పరీక్షలు రద్దుచేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు హాస్యాస్పదంగా ఉందని పవన్‌కల్యాణ్ అన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే మిలట్రీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిందన్నారు.
ఇదీ చదవండి: 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'