ETV Bharat / city

కలయికలో ఇబ్బంది.. కారణం ఏంటి..? - కలయికలో ఇబ్బంది

దంపతుల మధ్య అనేక సమస్యలుంటాయి. అందులో సెక్స్​ సమస్య ఒకటి.. వీటిని బయటకు చెప్పుకునేందుకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది మాత్రం తమ సమస్యలను డాక్టర్లకు చెప్పుకుని సమస్యకు పరిష్కారం తీసుకుని..జీవితాన్ని హ్యాపీగా మలుచుకుంటారు.

personal Problem
వ్యక్తిగత సమస్య
author img

By

Published : Oct 3, 2022, 5:36 PM IST

Updated : Oct 3, 2022, 5:42 PM IST

హలో డాక్టర్‌. నా వయసు 25. నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది.. అయినా ఇప్పటిదాకా మా ఇద్దరికీ కలయిక జరగలేదు. ఎంత ప్రయత్నించినా కలయిక సమయంలో బాగా నొప్పిగా ఉంటుంది. చాలా లూబ్రికెంట్స్‌ కూడా వాడాం.. అయినా ఫలితం లేదు. - ఓ సోదరి

జ: సాధారణంగా పెళ్లైన కొత్తలో కలయిక సమయంలో నొప్పి, ఇబ్బంది ఉన్నా సమయం గడుస్తున్న కొద్దీ వాటికవే సర్దుకుంటాయి. అయితే ఆరు నెలలైనా ఇంకా ఇబ్బందిగా ఉందంటే- సమస్య రెండు రకాలుగా ఉండచ్చు.. మొదటిది - శారీరకమైంది.. అంటే మీరు సందేహిస్తున్నట్లుగా- హైమెన్, వెజైనాలో సమస్యలుండచ్చు. రెండోది - మానసికమైనది. విపరీతమైన భయం, ఆందోళన వల్ల భర్త దగ్గరికి రాగానే కండరాలన్నీ ముడుచుకుపోయి కలయిక జరగకుండా అడ్డుకుంటాయి. ఈ సమస్యను ‘వెజైనిస్మస్’ అంటారు. ఒకవేళ మీ గైనకాలజిస్ట్‌ మీకు పరీక్ష చేసి మీకు శారీరకంగా ఏ లోపమూ లేదని చెప్తే.. వారే మిమ్మల్ని కౌన్సెలింగ్‌కి వెళ్లమని సలహా ఇస్తారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.