ETV Bharat / city

ఉత్తీర్ణత 'పది'పోయింది.. పదో తరగతిలో 67.26% మందే పాస్‌

SSC Results 2022: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,15,908 మంది పరీక్షలు రాయగా.. 4,14,281 మంది పాసయ్యారు. 20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

SSC Results 2022
పదో తరగతిలో 67.26% మందే పాస్‌
author img

By

Published : Jun 7, 2022, 4:19 AM IST

AP SSC Results: పదో తరగతి పరీక్షల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,15,908 మంది పరీక్షలు రాయగా.. 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. 20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాలను విజయవాడలో సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. బాలురు 64.02%, బాలికలు 70.70% మంది ఉత్తీర్ణులయ్యారు. ఉమ్మడి 13 జిల్లాల్లో 78.30% ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో, 49.70 శాతంతో అనంతపురం చిట్టచివరన నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 91.10%, ప్రభుత్వ పాఠశాలలు అతితక్కువగా 50.10 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 11,671 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 797 పాఠశాలల్లో వందశాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 71 బడుల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో 91% నుంచి 98% మంది ఉత్తీర్ణత సాధించగా.. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు వచ్చేసరికి 82 శాతంలోపే ఉంది. మొదటి మూడు పరీక్షల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులు కాగా.. ఆ తర్వాత జరిగిన వాటిల్లో ఎక్కువమంది ఫెయిలయ్యారు.

ఫలితాలు

సప్లిమెంటరీ జులై 6 నుంచి..
జులై 6 నుంచి 15 వరకు అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సైతం రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా డివిజన్‌లు ఇస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ ఒక్కసారి దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 13 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, మంగళవారం నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

‘సాంకేతిక సమస్య కారణంగా శనివారం ఫలితాలు ఇవ్వలేకపోయాం. మాజీ మంత్రి ఒకరు చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. పత్రికల్లో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, మంత్రికి మధ్య అంతరం ఉందని రాశారు. ఫలితాల విడుదలలో రాజకీయ జోక్యం ఎందుకు? అధికారులనే విడుదల చేయాలని చెప్పాను. దీన్ని చిలవలు పలవలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాలని ఫలితాల విడుదలకు వచ్చాను. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు. మాస్‌కాపీయింగ్‌పై నమోదైన కేసుల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై పోలీసులతో మాట్లాడతాం. జులై 4కు ముందే పాఠశాలలను తెరిచినా.. ర్యాంకులు, మార్కులతో ప్రకటనలు ఇచ్చినా చర్యలు తీసుకుంటాం. పురపాలక పాఠశాలల ఆస్తులను పాఠశాల విద్యకు ఇవ్వడం లేదు. కేవలం ఉపాధ్యాయుల సర్వీసు, అకడమిక్‌ అంశాలను మాత్రమే విద్యాశాఖ చూస్తుంది. ప్రస్తుతం జిల్లాపరిషత్తు బడుల్లాగే పురపాలక బడులు ఉంటాయి’ౖ అని మంత్రి బొత్స తెలిపారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు బోధన మెరుగు పడాలి. విద్యార్థులకు బాగా చదువు చెబితే ఉత్తీర్ణత పెరుగుతుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బోధన సరిగా జరగలేదు. ఇంటి వద్ద తల్లిదండ్రుల మార్గదర్శకం సరిగా లేకపోవడంవల్లా ఉత్తీర్ణత తగ్గింది.

- మంత్రి బొత్స

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున

ఎస్సీ గురుకులాల్లో 69శాతం ఉత్తీర్ణత
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాలు పదో తరగతి ఫలితాల్లో 69 శాతం ఉత్తీర్ణత సాధించాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. జిల్లాలవారీగా చూస్తే చిత్తూరు గురుకులాలు 92 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటిస్థానంలో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 185 గురుకులాల ద్వారా మొత్తం 13,649 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 9,435 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాలకు చెందిన విద్యార్థులు 8,263 మంది పరీక్షకు హాజరుకాగా 4,095 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం, పూతలపట్టు బాలుర గురుకులాలు, తూర్పుగోదావరి జిల్లా చొల్లంగిపేట బాలికల గురుకులాల్లోని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

598 మార్కులతో మెరిసిన పశ్చిమ విద్యార్థిని

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సిహెచ్‌.హరి సాత్విక పదో తరగతిలో 598 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు విజయకుమారి, సాయిశ్రీ ప్రైవేటు విద్యాసంస్థల్లో అధ్యాపకులు. హరి సాత్విక ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివింది. ‘‘రోజూ ఉదయం, సాయంత్రం నాలుగేసి గంటల వరకూ అదనంగా చదివాను. పాఠశాల గ్రంథాలయంలో పాఠ్యాంశాలకు సంబంధించి అనుబంధ పుస్తకాలను అధ్యయనం చేశా’’ అని విద్యార్థిని తెలిపింది.

ఫలితాలు

ఇదీ చదవండి: టెన్త్ ఫలితాల్లో అత్యధికులు ఫెయిల్ కావడం.. ప్రభుత్వ కుట్రలో భాగమే : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.