ETV Bharat / city

నది ఒడ్డున పార్టీ... ఇద్దరు గల్లంతు

దీపావళి పండుగ రోజున తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వారిలో ఇద్దరు ఆచూకీ లభ్యం కాగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ స్పందించారు.

author img

By

Published : Nov 15, 2020, 8:49 AM IST

PARTY BY THE GODAVARI RIVER TWO MEMBERS MISSING IN MULUGU DISTRICT
ములుగు జిల్లాలో విషాదం

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుక కోసం గోదావరి ఒడ్డుకు 20 మంది యువకులు వెళ్లారు. పార్టీ అనంతరం గోదావరిలో నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు.

ఆ యువకుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని ప్రకాష్, కార్తీక్​గా గుర్తించారు. మరో ఇద్దరు అన్వేష్, శ్రీకాంత్​ల జాడ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఈ ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్ విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్​లతో మాట్లాడి ఆరా తీశారు. గల్లంతైన వారిని వెంటనే వెతికే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని... మునిగిపోయిన యువకులను వెతకడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

అగ్నిప్రమాదం: తారాజువ్వలు పడి రెండు పూరిళ్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.