ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జనసేన పక్షాన సహకరించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లో పవన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒడిశాలోని తెలుగు ప్రజల స్థితిగతులు, సరిహద్దు ప్రాంత సమస్యలపై చర్చించారు. గజపతి జిల్లా పరిధిలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువమంది ఉన్నారని నారాయణరావు పవన్ కల్యాణ్‌కు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పాలనాపరమైన నిబంధనలతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. ఆయన విజ్ఞప్తికి పవన్ సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి