ETV Bharat / city

ELECTION RESULTS: 504 జడ్పీటీసీలు.. 5,997 ఎంపీటీసీలు అధికార పార్టీ కైవసం - ఏపీ న్యూస్

ఎన్నికలు నిర్వహించిన 515 జడ్పీటీసీల్లో 504...., 7,219 ఎంపీటీసీల్లో 5,997 స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆరు జడ్పీటీసీ, 827 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. మూడో స్థానంలో జనసేన నిలిచింది.

ysrcp
ysrcp
author img

By

Published : Sep 21, 2021, 7:27 AM IST

ఎన్నికలు నిర్వహించిన 515 జడ్పీటీసీల్లో 504 (97.86%), 7,219 ఎంపీటీసీల్లో 5,997 (83.07) స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆరు జడ్పీటీసీ, 827 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. కడియం (తూ.గో.జిల్లా), వీరవాసరం (ప.గో.జిల్లా) జడ్పీటీసీ స్థానాలను జనసేన దక్కించుకుంది. 177 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. విశాఖ జిల్లా అనంతగిరి జడ్పీటీసీ స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. అనంతపురం జిల్లా రోళ్లలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థి గెలుపొందారు. కడప జిల్లా జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానం పరిధిలోని రెండు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలు నీటితో తడిచిపోవడంతో లెక్కింపునకు అంతరాయం ఏర్పడి, ఫలితాలు నిలిపివేశారు. ఎంపీటీసీ స్థానాల్లో భాజపా 28 చోట్ల, సీపీఎం 15, సీపీఐ 8, కాంగ్రెస్‌ 4, స్వతంత్రులు 136 చోట్ల, ఇతరులు మరో 19 స్థానాల్లో గెలిచారు. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించింది. బ్యాలెట్‌ పెట్టెల్లోకి నీళ్లు చేరడంతో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు నిలిపివేశారు.

జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు

ఈ నెల 24న మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షులు, 25న జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికపైనా సూచనలు చేసింది. విజేతలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు.. జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రత్యేక సమావేశానికి విధిగా హాజరుకావాలని జిల్లాల్లో అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్తుల్లో రెండో వైస్‌ ఛైర్మన్‌ను కూడా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్‌ మేరకు రెండో వైస్‌ఛైర్మన్లను జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకోవచ్చని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఒక జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

బాక్సుల్లోకి నీరు చేరి బ్యాలెట్లు తడిచిపోవడం, చెద పట్టడంతో ఓట్ల లెక్కింపునకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి కారణాలతో రాష్ట్రంలోని ఒక జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీ స్థానాల పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.
* కడప జిల్లా జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగెనూరు ఎంపీటీసీ పరిధిలోగల 7, 8 పోలింగ్‌ కేంద్రాల్లో వర్షపు నీటితో బ్యాలెట్‌ పత్రాలు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ రెండు కేంద్రాల్లోనూ రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయించింది.
* శ్రీకాకుళం జిల్లా అంబుగం ఎంపీటీసీ పరిధిలోని 63వ నంబరు పోలింగ్‌ కేంద్రం, ఆమదాలవలస మండలం కాత్యాచార్యులపేట ఎంపీటీసీ పరిధిలోని 25వ నంబరు పోలింగ్‌ కేంద్రం, విశాఖ జిల్లా గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ పరిధిలోని 29, 30 నంబరు పోలింగ్‌ కేంద్రాలు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దొరచింతలపాలెం ఎంపీటీసీ పరిధిలోని 19 నుంచి 25 వరకు గల ఏడు పోలింగ్‌ కేంద్రాలు, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ పరిధిలోని 13/25 నంబరు పోలింగ్‌ కేంద్రాల్లోనూ రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.

విజేతలు మృతి చెందినచోట ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌

ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా నామినేషన్లు వేసినవారు కొందరు ఎన్నికల ముందు చనిపోవడంతో ఆయా స్థానాల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. పోలింగ్‌ తర్వాత చనిపోయినవారిలో కొందరు ఈ ఎన్నికల్లో గెలిచారు. ఈ స్థానాల్లో వీలైనంత త్వరలో మరోసారి ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించారు.

ఇదీ చదవండి: cm jagan on parishad results: 'ఈ అఖండ విజయం..మా బాధ్యతను పెంచింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.