ETV Bharat / city

జూనియర్‌ కళాశాలల్లో అభివృద్ధి కమిటీలు

author img

By

Published : Jul 20, 2020, 1:07 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(పీఎంసీ) తరహాలోనే జూనియర్‌ కళాశాలల్లోనూ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. నాడు..నేడు కార్యక్రమాన్ని కళాశాలలకు కూడా విస్తరింపజేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

parents comittes are going to be started in inter colleges
జూనియర్‌ కళాశాలల్లో అభివృద్ధి కమిటీలు

ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(పీఎంసీ) తరహాలోనే జూనియర్‌ కళాశాలల్లోనూ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. నాడు..నేడు కార్యక్రమాన్ని కళాశాలలకు కూడా విస్తరింపజేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ క్రమంలో వాటిల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, దాతలు, మనోవికాస నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. 750 కంటే ఎక్కువమంది విద్యార్థులు ఉన్న కళాశాలల్లో 20 మంది సభ్యులతో, అంతకంటే తక్కువమంది ఉంటే 16 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేశారు. కమిటీకి ప్రిన్సిపల్‌ కన్వీనర్‌గా.. తల్లిదండ్రుల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నిజాంపట్నం, బాపట్ల, చందోలులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన 19చోట్ల నాడు..నేడు కింద కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు. కమిటీల ఏర్పాటుకు షెడ్యూలు.. మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నారు. పాఠశాలల తరహాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అభివృద్ధి కమిటీల్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్‌ఐఓ జడ్‌ఎస్‌ రామచంద్రరావు, డీవీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఈనెల 20 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.