ETV Bharat / city

చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?..యువతకు ఓటుహక్కు పిటిషన్​పై హైకోర్టు - ap high court news

పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై...... ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానానికి ఉన్న అధికారాలేంటి..? నిబంధనలు ఏం చెబుతున్నాయని..... హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఎన్నికల్లో 3 లక్షల 60 వేలమంది యువత ఓటు వేసే హక్కు కోల్పోతున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై... ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే తరహాలో దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలతో కలిపి... ఇవాళ విచారణ కొనసాగనుంది.

high court
ఏపీ హైకోర్టు
author img

By

Published : Jan 29, 2021, 4:58 AM IST

2019 నాటి ఓటరు జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే..... 3 లక్షల 60 వేల మంది ఓటు వేసే అవకాశం కోల్పోతారంటూ దాఖలైన వ్యాజ్యంపై.... హైకోర్టు విచారణ జరిపింది.

3 లక్షల 60 వేలమంది యువత ప్రాథమిక హక్కు కోల్పోతున్నారని.... ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ... గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని అఖిల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల నొటిఫికేషన్‌ రద్దు చేసి, యువతకు ఓటు హక్కు కల్పించాకే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని... ధర్మాసనాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోరారు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించడానికి..... ఒకటి, రెండు ఓట్లు కూడా కీలకమేనని వాదించారు. గ్రామపంచాయతీ చట్టంలోని సెక్షన్-11, 201(2) ప్రకారం...... ఎన్నికల కమిషనర్ ఆథరైజ్ చేసిన వ్యక్తి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేస్తోందన్నారు. అలాంటప్పుడు జాబితా సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్న న్యాయవాది..... ఎస్ఈసీ మాత్రం ఆ బాధ్యత పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లదని చెబుతున్నారని వాదించారు. జాబితా రూపకల్పన బాధ్యత ఎన్నికల సంఘానిదే తప్ప.... ప్రభుత్వానిది కాదన్నారు.

ప్రస్తుత దశలో జోక్యానికి కోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి?
ఎన్నికల ప్రక్రియ ఇంతవరకూ వచ్చాక... ఈ దశలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానానికి ఉన్న అధికారాలేమిటో చెప్పాలని... ధర్మాసనం ప్రశ్నించింది. 3 లక్షల 60 వేల మంది ఓటు హక్కు కోల్పోతున్నప్పుడు.... జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిచ్చారు. పిటిషనర్ వేసిన అఫిడవిట్‌లో వివరాలేమీ లేవని.... ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదించారు. ఓటరు నమోదు నిబంధనలు 13(1 ), 26 ప్రకారం... ఓటు హక్కు పొందేందుకు పిటిషనర్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వ్యాజ్యం వేశారని... అందువల్ల ఈ అభ్యర్థనను కొట్టి వేయాలని కోరారు. ప్రస్తుత కేసు విషయంలో... 2021 ఓటరు జాబితా తయారు చేయాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వలేదని... ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదించారు. ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేశాక ఓటరు జాబితా విషయంలో ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. ఎన్నికల్లో 2021 ఓటరు జాబితా వినియోగిస్తామని ఎస్ఈసీ నవంబర్ 23న చెప్పినప్పటికీ.... ఆ తర్వాతి నోటిఫికేషన్లలో 2019 జాబితానే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొందన్నారు.

మీరే అమికస్ని అయితే ఏం చెబుతారు?
అందరి వాదనలూ విన్న ధర్మాసనం..... ప్రస్తుత దశలో కోర్టు జోక్యం చేసుకోవడానికి ఉన్న అధికారాలేంటి ..? మీరే అమికస్ని అయితే ఏం చెబుతారని.... ధర్మాసనం ప్రశ్నించింది. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని.. ప్రభుత్వ న్యాయవాది సుమన్ బదులిచ్చారు. ప్రస్తుత దశలో కోర్టు జోక్యం కుదరదని... పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని...... కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ నివేదించారు. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లతో కలిపి శుక్రవారం విచారణ జరుపుతామని... ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

పల్లె పోరులో తొలి ఘట్టం...నేటి నుంచే నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.