ETV Bharat / city

ఏపీలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు.. 'ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్‌ సర్వీసెస్-ఆప్కోస్' పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు
author img

By

Published : Nov 5, 2019, 6:28 AM IST

Updated : Nov 5, 2019, 6:41 AM IST

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్‌ సర్వీసెస్-ఆప్కోస్' పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. లాభాపేక్ష రహిత సంస్థగా ఇది పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆప్కోస్ సంస్థను నడిపించేందుకు చైర్మన్‌తో పాటు బోర్డ్ ఆఫ్‌ డైరెక్టర్ల నియామకాన్ని ప్రకటిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి వ్యవహరిస్తారని.. డైరెక్టర్లుగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయవాడ కేంద్రంగా 10 కోట్ల రూపాయల మూలధనంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఏజెన్సీల బారినపడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకుండా ఈ కొత్త కార్పొరేషన్ పనిచేస్తుందని ప్రభుత్వం వివరించింది.

ఇవీ చదవండి..

విశాఖలో కెరియర్ సోర్స్ సంస్థ మోసం

Intro:ప్రైవేట్ సంస్థలు డిపాజిట్లు సేకరించి ఎగ్గొడితే వారి నుంచి రికవరీ ద్వారా కాకుండా బాధితులను బాధితులను ఆదుకున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదని గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 7న గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చైయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తీరుగా పదివేల లోపు డిపాజిట్ చేసిన వారికి పరిహారం అందించేందుకు సీఎం ముందడుగు వేశారని అన్నారు.
బైట్: చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇంఛార్జి మంత్రి
: మేకతోటి సుచరిత, హోం మంత్రి
: మోపిదేవి వెంకటరమణ రావు, పశుసంవర్ధక శాఖ
మంత్రి

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
Last Updated : Nov 5, 2019, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.