ETV Bharat / city

తెలంగాణ: షెడ్యూల్​ ప్రకారమే ఓయూ పీజీ పరీక్షలు.. డిగ్రీవి మాత్రం వాయిదా!

దసరా తర్వాత జరగనున్న పీజీ పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ కేంద్రం తెలిపింది. పీజీ బ్యాక్​లాగ్​ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని.. డిగ్రీ పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయంది. వాటి షెడ్యూల్​ను నవంబర్ మొదటి వారంలో ఓయూ ప్రకటించనుంది.

osmania-university-exams-cancelled-and-postponed
అక్టోబర్‌ 27 నుంచి షెడ్యూల్​ ప్రకారం
author img

By

Published : Oct 27, 2020, 7:08 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. వీధులన్నీ చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో అనేక యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా పీజీ పరీక్షలతో పాటు వివిధ పరీక్షలను వాయిదా వేసింది. దసరా తరువాత పరీక్షల రీషెడ్యూల్ ప్రకటిస్తామని ఓయూ తెలిపింది. అయితే ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గడం, దసరా కూడా పూర్తవ్వగా తిరిగి పరీక్షల తేదీలను ప్రకటించింది.

పరీక్ష తేదీలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అన్ని రకాల పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు) మంగళవారం(అక్టోబర్‌ 27) నుంచి షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ప్రకటించింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.osmania.ac.in/ లో చూసుకోవచ్చని పేర్కొంది. అయితే డిగ్రీ మొదటి నుంచి ఐదో సెమిస్టర్​ బ్యాక్​లాగ్​ పరీక్షలు వాయిదా పడ్డాయని విశ్వవిద్యాలయం తెలిపింది. కొత్త షెడ్యూల్​ను నవంబర్​ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో కొవిడ్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.