తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాలు ఒకే ఇంటికి చెందిన ముగ్గురిని పొట్టనబెట్టుకున్నాయి. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి వ్యవసాయక్షేత్రంలోనే అత్యంత పాశవికంగా చంపేశారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు తండ్రి మంజూనాయక్, కుమారులు భాస్కర్ నాయక్, సారయ్య నాయక్‌లుగా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Capital Protest: అమరావతి పోరుకు 550 రోజులు..ఏ రోజు ఏం జరిగిందంటే !