ETV Bharat / city

Oommen Chandy: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి: ఉమెన్ చాందీ - పీవీకి ఉమెన్ చాందీ నివాళి

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ(Oommen Chandy) స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ శత జయంతి సందర్భంగా..ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Oommen Chandy
Oommen Chandy
author img

By

Published : Jun 28, 2021, 5:23 PM IST

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా.. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ(Oommen Chandy), ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్​లు.. పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఉమెన్ చాందీ తెలిపారు.

Oommen Chandy  tribute to Pv Narasimha Rao
పీవీకి నివాళి

ధరల భారంపై జిల్లాల్లో సైకిల్ యాత్రలు

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఉమెన్‌ చాందీ(Oommen Chandy) స్పష్టం చేశారు. ఇతర సీనియర్ నేతలు మాత్రం పార్టీ సమావేశాలకు వస్తున్నారన్నారు. పెట్రో ధరల పెంపుపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించామని...పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు భారంగా మారాయన్నారు. ధరల భారంపై జిల్లాల్లో సైకిల్ యాత్రలు చేస్తామని...జులై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. కాంగ్రెస్ పునర్నిర్మాణం దిశగా ఇకపై కార్యక్రమాలు శ్రీకారం చుడతామన్నారు. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని....హోదా అంశంలో భాజపా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఛారిటీ మాత్రమే నడుస్తుందని....అభివృద్ధి పనులు అన్ని ఆగిపోయాయని విమర్శించారు.

ఇదీ చదవండి: BJP State Meet: రాష్ట్రంలో ప్రచార ఆర్భాటం ఎక్కువైంది: సోము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.