ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో దాదాపు 34 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వస్తోందని.. ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు కన్నీరు మిగిలిందని విచారం వ్యక్తం చేశారు. ఉల్లి పంట అమ్మకానికి ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడిందని... ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉల్లిపంటను రైతుల వద్ద నుంచి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!