ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓఎన్జీసీ ఉన్నతాధికారుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఓఎన్జీసీ ఈడీ ఎ.జె. మొర్బలే, కాకినాడ ఓఎన్జీసీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. కాకినాడ ఈస్ట్రన్ ఆప్షోర్ పరిధిలో జరుగుతున్న కార్యకలాపాల గురించి సీఎంకు వివరించారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద కాకినాడ, పరిసర ప్రాంతాల్లో చేస్తున్న సామాజిక సేవలు తెలిపారు. పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి సీఎం హామీ ఇచ్చారని ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరింతగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మారుమూల ప్రాంతాల్లో వైద్యారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఓఎన్జీసీ బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.
సీఎంతో ఓఎన్జీసీ ప్రతినిధుల బృందం భేటీ
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో ఓఎన్జీసీ ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేస్తున్న అభివృద్ధి పనులు వివరించారు.