అన్నీ ఒకేసారి...
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉన్న 40 పనిదినాలకు అందాల్సిన 34 గుడ్లను 17 చొప్పున రెండుసార్లు ఇవ్వాలని నిర్ణయించారు. చాలా పాఠశాలలకు ఈ సమయంలో గుడ్లు సరఫరా కాలేదు. వీటిని విద్యార్థులకు ఇవ్వకుండానే తాజాగా జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు 62 పనిదినాలకు మరో 56 గుడ్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రెండు విడతలకు చెందిన మొత్తం 90 గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు. పల్లీ చిక్కీలదీ ఇదే పరిస్థితి. మూడు, నాలుగు విడతలవీ కలిపి ఒక్కో విద్యార్థికి 56 వరకు రానున్నాయి. పంపిణీని ఇప్పటికే కొన్ని చోట్ల మొదలుపెట్టారు. సరకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరున్న విద్యార్థులకు పోషకాహారం అందుతుంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ కోడిగుడ్లను ఇవ్వడం వల్ల చెడిపోయే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం