ETV Bharat / city

50 మంది కళాకారులతో 'వన్​ ఇండియా కాన్సర్ట్​' - ONE INDIA CONCERT

లాక్​డౌన్​ వల్ల దేశంలోని వివిధ రంగాలతో పాటు ఈవెంట్​ మేనేజ్​మెంట్​ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రపంచ ఈవెంట్ మేనేజర్స్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని 50 మందికి పైగా కళాకారులతో ఐఈపీఏ ఆధ్వర్యంలో నేడు వన్​ ఇండియా కాన్సర్ట్​ చేపట్టనున్నారు. కొవిడ్ కాలంలో కష్టపడేవారి కోసం నిధులు సేకరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

one india concert
50 మంది కళాకారులతో 'వన్​ ఇండియా కాన్సర్ట్​'
author img

By

Published : May 31, 2020, 8:45 AM IST

మార్చి 23, 2020న ప్రధాని మోదీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా ప్రభావంతో.. వ్యాపారాలు, రవాణా... ప్రజల జీవనశైలి కూడా లాక్​డౌన్​ మోడ్​లోకి వెళ్లిపోయింది. ఈ దెబ్బతో అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ముఖ్యంగా.. ఈవెంట్​ మేనేజ్​మెంట్​ పరిశ్రమలపై భారీగా పడిందని ఓ నివేదిక తెలిపింది.

ఆ నివేదికల ప్రకారం ఈవెంట్​ మేనేజర్లకు ఏప్రిల్​ నుంచి జులై వరకు మాత్రమే 93 శాతం ఆదాయం వస్తుందని... లాక్​డౌన్​ వల్ల అవి కూడా రద్దు అయ్యాయని ఆ రంగ నిర్వాహకులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా చేతులు కలిపి.. ఈ విపత్కర పరిస్థితి నుంచి కొత్త మార్గాలను స్వీకరించాలని.. నిజమైన వ్యాపార స్ఫూర్తిని చూపించాలని నిర్ణయించారు.

ప్రపంచ ఈవెంట్ మేనేజర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఈపీఏ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో 50 మంది కళాకారులు కలిసి మే 31న వన్​ ఇండియా కాన్సర్ట్​ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, అసోం, బిహార్, కర్ణాటక, పంజాబ్​.. తదితర ప్రాంతాలకు సంబంధించిన కళాకారులు పాల్గొంటారు.

ఇది కేవలం ప్రజలకు ఉల్లాస పరచడానికి అనుకుంటే పొరబడినట్లే. ఈ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్​ కాలంలో ఉపాధులు కోల్పోయి ఇబ్బంది పడుతున్నవారికి అందజేయనున్నట్లు ఇండియన్​ ఈవెంట్ ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​ (ఐఈపీఏ) సభ్యులు సంజీవ్​ దే తెలిపారు. 300 మంది కృషితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.