ETV Bharat / city

కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై కసరత్తు.. సీఎందే తుది నిర్ణయం! - ఏపీ తాజా వార్తలు

కర్ఫ్యూలో షరతులతో కూడిన మరికొన్ని మినహాయింపులు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నెల 21 నుంచి.. సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కర్ఫ్యూను మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేస్తున్నారు.

Officials discuss curfew
Officials discuss curfew
author img

By

Published : Jun 17, 2021, 9:08 AM IST

గత నెల 5 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దశల వారీగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నెల 20తో ముగియనుంది. ప్రస్తుతం కేసుల తగ్గుదలను అనుసరించి కర్ఫ్యూ సమయాన్ని కుదించనున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ నిర్వహించే సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ అమల్లో ఇవ్వాల్సిన మినహాయింపులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పరిశీలనలో ఉన్న ప్రధాన మినహాయింపులు..

* వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల వ్యవసాయ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, ఆక్వాకల్చర్‌, ఇతర రంగాల్లో యథావిధిగా కార్యకలాపాలు.

* మార్కెట్‌యార్డుల్లో జరిగే కార్యకలాపాల వికేంద్రీకరణ.

* పట్టణ/గ్రామాల్లోని పరిశ్రమల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించడం. క్యాంటీన్లు ప్రారంభించకూడదు. పార్సిళ్ల ద్వారా ఆహారాన్ని తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించడం. వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్నచోట్ల ఉండే పరిశ్రమల విషయంలో షరతులు ఉంటాయి.

* ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో 50% ఉద్యోగులు పనిచేసే అవకాశాన్ని కల్పించడం. షిఫ్టు విధానంలో ఉద్యోగులతో పని చేయించుకునే విధానాన్ని పరిశీలించడం.

* ఆటోల్లో డ్రైవర్‌ కాకుండా అదనంగా ఇద్దరు ప్రయాణించేందుకు అనుమతి.

* టాక్సీల్లో డ్రైవర్‌ కాకుండా ముగ్గురు ప్రయాణించొచ్చు.

ఇదీ చదవండి:

Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.