ఒడిశాకు చెందిన ఐపీఎస్ అధికారిణి కనిపించడం లేదంటూ కటక్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం వివిధ పత్రికల్లో బుధవారం ప్రకటన ప్రచురించింది. కార్యాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిణి భారతి.. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఐజీగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా ఆమె విధులకు హాజరు కావడం లేదు. ఆమె సెలవులు తీసుకోలేదు. అధికారులకు మౌఖికంగా కూడా చెప్పలేదు. దీంతో హెచ్ఆర్పీసీ విభాగంలో కేసులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆమెకు పలుమార్లు నోటీసులు పంపించినా అవి వెనక్కి వచ్చాయి. మెయిల్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో ఆమెపై శాఖాపరంగా చర్యలు ప్రారంభించారు.
ఇదీచదవండి.