NTR Health University MBBS Exams: కడప రిమ్స్ కళాశాలలో 50 మందికి విద్యార్థులకు కరోనా సోకడంతో.. రేపు జరిగే పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు కోరారు. అయితే.. పరీక్షలను వాయిదా వేయలేమని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పాజిటివ్ విద్యార్ధులకు ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి సూచించారు. పరీక్షల వాయిదాపై రాతపూర్వక అభ్యర్థన రాలేదని వర్సిటీ రిజిస్ట్రార్ చెప్పారు.
"కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని ఫోన్లు వచ్చాయి. పరీక్షల వాయిదాపై రాతపూర్వక అభ్యర్థన రాలేదు. మంగళవారం వైద్య విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. కరోనా సోకినవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు నిర్వహించేలా కళాశాల ప్రిన్సిపల్ చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలు వాయిదా వేయలేం" - రిజిస్ట్రార్, ఎన్టీఆర్ వర్సిటీ
కడప రిమ్స్‌లో కరోనా కలకలం..
corona cases in Kadapa RIMS: కడప రిమ్స్‌లో కరోనా కలకలం రేగింది. కళాశాలలోని 50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. కళాశాలలో రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడగా.. మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది. రేపు ఫైనల్ పరీక్షలు జరగనుండగా.. కొవిడ్ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్ వర్సిటీ... పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ప్రత్యేక తరగతి గదుల్లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు..
Corona cases in India: మరోవైపు భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,73,80,253
- మొత్తం మరణాలు: 4,86,451
- యాక్టివ్ కేసులు: 16,56,341
- మొత్తం కోలుకున్నవారు: 3,52,37,461
Omicron Cases In India : దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
Kadapa RIMS: కడప రిమ్స్‌లో కరోనా కలకలం.. 50 మంది విద్యార్థులకు పాజిటివ్