ETV Bharat / city

తెలంగాణలో.. డీఏవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - డీఏఓ పోస్టుల భర్తీ 2022

Notification for DAO posts in telangana: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టర్​ ఆఫ్​ వర్క్స్​ అకౌంట్స్​ విభాగంలో 53 డివిజినల్​ అకౌంట్స్​ అధికారుల పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్​ విడుదలైంది.

Notification for DAO posts
డీఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
author img

By

Published : Aug 5, 2022, 12:11 PM IST

Notification for DAO posts in telangana: తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబరు ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

ఏఎంవీఐ దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్ల(ఏఎంవీఐ) పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. నేటినుంచి ఆన్‌లైన్‌లో స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. స్వీకరణ కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలియజేసింది.

నిబంధన సడలించాలి.. గత నెల 27న ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి అభ్యర్థులు హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలనే నిబంధన సడలించి హెవీ వెహికల్‌ లైసెన్సు గడువు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కోరారు. వారంతా ఖమ్మం వచ్చి క్యాంప్‌ కార్యాలయంలో మంత్రిని కలసి వినతి పత్రం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.