రాష్ట్రంలో పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో మంగళ, బుధవారాల్లో మొత్తం 7,263 మంది ఉపసంహరించుకున్నారు. అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గిన వారిలో అత్యధికులు ఉన్నారు.
12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 8,787 మంది తుది పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణలు, బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను రాత్రి 12 గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించలేదు. విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో లెక్కలు తేల్చడంలో తీవ్ర జాప్యం కావడంతో అధికారులు తుది జాబితా సకాలంలో ప్రకటించలేకపోయారు.
ఇదీ చదవండి:
చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం.. ప్రలోభాలు, ఒత్తిళ్లే కారణమన్న విపక్షం