ETV Bharat / city

Ts Teenmaar Mallanna arrest : తీన్మార్​ మల్లన్నకు 14 రోజుల రిమాండ్​ - Nizamabad court

తెలంగాణలో కల్లు వ్యాపారి వద్ద తీన్మార్ మల్లన్న బృందం డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న(teen mar mallanna arrest)ను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాకోర్టులో హాజరుపరుచగా.. కోర్టు మల్లన్నకు 14 రోజులు రిమాండ్ విధించింది.

Teenmaar Mallanna
తీన్మార్​ మల్లన్న
author img

By

Published : Sep 24, 2021, 5:03 PM IST

తెలంగాణలో కల్లు వ్యాపారి వద్ద తీన్మార్ మల్లన్న బృందం డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై మల్లన్న(teenmar mallanna arrest) సహా ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Ts Teenmaar Mallanna arrest
తీన్మార్​ మల్లన్నకు 14 రోజుల రిమాండ్​

మరోవైపు.. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని మల్లన్న(teen mar mallanna arrest) భార్య జాతీయ బీసీ కమిషన్​కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డిని కోరారు.

విచారణ జరిపి నివేదికను పరిశీలించిన కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత రికార్డులన్ని తీసుకుని ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు స్టే కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

  • ఇదీ చదవండి :

conflict : 'ఆ పదవి మాకు కావాలి... కాదు మాకే కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.