ETV Bharat / city

నెల్లూరుకు 'నివర్' ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు - Niver cyclone live updates

Niver cyclone live updates
Niver cyclone live updates
author img

By

Published : Nov 25, 2020, 8:07 AM IST

Updated : Nov 25, 2020, 8:33 PM IST

20:32 November 25

కావలి మండలంలో ఎగసిపడుతున్న అలలు

నెల్లూరు: కావలి మండలంలో ఎగసిపడుతున్న అలలు

10 మీటర్ల దూరం వరకు ముందుకొచ్చిన అలలు
కావలిలో గాలివాన, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆర్డీవో శ్రీనివాసులు

20:31 November 25

స్వదేశీ విమాన సర్వీసులు రద్దు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు స్వదేశీ సర్వీసులు రద్దు
నివర్ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు
వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే చెన్నై, బెంగుళూరు సర్వీసులు రద్దు

రేపు మిగిలిన సర్వీసులూ రద్దయ్యే అవకాశం ఉందన్న అధికారులు

20:04 November 25

నివర్ తుపాను వల్ల రేపు పాఠశాలలకు సెలవు

  • కడప: నివర్ తుపాను వల్ల రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్ హరికిరణ్
    ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్
  • ఈదురుగాలులు, భారీవర్షాల సూచనతోనే ఈ నిర్ణయం: కలెక్టర్

20:00 November 25

తాడేపల్లి, మంగళగిరిలో వర్షం

గుంటూరు: తుపాను ప్రభావంతో తాడేపల్లి, మంగళగిరిలో వర్షం

18:57 November 25

నివర్ తుపాన్‌ ప్రభావంతో సోమశిల జలాశయం గేట్లు ఎత్తివేత

సోమశిల జలాశయం 11, 12 గేట్లు ఎత్తిన జలవనరుల శాఖ అధికారులు
జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు నీటిని పెన్నానదికి వదిలిన అధికారులు
జిల్లాలో 1,746 చెరువులుగాని ఇప్పటికే 1,400 చెరువులు పూర్తిగా నిండాయి: అధికారులు 
సూళ్లూరుపేట, నాయుడుపేట మండలా‌ల్లో వరిపంట పొలాలు నీటమునిగాయి: అధికారులు

17:54 November 25

నైరుతి బంగాళాఖాతంలో పెను తుపానుగా మారిన నివర్

అర్ధరాత్రికి కడలూర్-మామల్లపురం వద్ద తీరం దాటనున్న నివర్
ప్రస్తుతం గంటకు 16 కి.మీ. వేగంతో తీరం వైపునకు వస్తున్న పెను తుపాను నివర్

17:54 November 25

నివర్ తుపాను ప్రభావిత స్టేషన్లలో హెల్ప్‌ లైన్లు ఏర్పాటు

నివర్ తుపాను ప్రభావిత స్టేషన్లలో హెల్ప్‌ లైన్లు ఏర్పాటు: ద.మ రైల్వే
విజయవాడ హెల్ప్ లైన్ నెంబరు 0866 2767239 
గుంటూరు హెల్ప్ లైన్ నెంబరు 0863 2266138

సికింద్రాబాద్ హెల్ప్ లైన్ నెంబరు 040 27833099
గుంతకల్లు హెల్ప్ లైన్ నెంబరు 78159 15608

17:44 November 25

తుపాను దృష్ట్యా ఇవాళ, రేపు నడవనున్న పలు రైళ్లు రద్దు

తుపాను దృష్ట్యా ఇవాళ, రేపు నడవనున్న పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే

రేపటి చెన్నై సెంట్రల్‌-తిరుపతి రైలు రద్దు చేసిన ద.మ రైల్వే

రేపు నడవనున్న తిరుపతి-చెన్నై సెంట్రల్‌ రైలు రద్దు చేసిన ద.మ రైల్వే

రేపటి హైదరాబాద్‌-తంబరం, తంబరం- హైదరాబాద్‌ రైలు రద్దు

రేపటి మదురై-బికనీర్‌, బికనీర్‌-మదురై రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

రేపటి చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి రైలు రద్దు చేసిన ద.మ.రైల్వే

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 8 రైళ్లు దారి మళ్లింపు, 1 రైలు రద్దు

17:02 November 25

నెల్లూరు: ఆత్మకూరు డివిజన్‌లో అధికారులను అప్రమత్తం చేసిన ఆర్‌డీవో

నివర్ తుపాను ప్రభావంతో ఆత్మకూరులో ఉదయం నుంచి వర్షం
75 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండుకుండలా సోమశిల జలాశయం
సోమశిల నుంచి దిగువకు నీరు విడుదల చేసేందుకు అధికారుల ఏర్పాట్లు

పెన్నా పరివాహక ప్రాంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సన్నద్ధం

15:52 November 25

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్

ప్రస్తుతం కడలూరుకు 180 కి.మీ., పుదుచ్చేరికి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

తీరం వైపుగా గంటకు 11 కి.మీ. వేగంతో కదులుతున్న తీవ్ర తుపాను నివర్
కొన్ని గంటల్లో పెను తుపానుగా మారుతుందని వెల్లడించిన ఐఎండీ
అర్ధరాత్రి తర్వాత కరైకల్-మామల్లపురం వద్ద తీరం దాటుతుందన్న ఐఎండీ 
తీరం దాటేటప్పుడు గాలుల వేగం 120-145 కి.మీ. ఉంటుందన్న ఐఎండీ 
తమిళనాడు తీరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి: ఐఎండీ
తుపాను ప్రభావం వల్ల నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి: ఐఎండీ

రాత్రి నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

రాత్రి నుంచి అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

14:42 November 25

కడప: నివర్ తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు

కడప: నివర్ తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. కడప జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో 3 బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలీసు సబ్ డివిజన్‌లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేశారు. తుపాను జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయల్‌రన్ చేశారు.

13:52 November 25

మరో 6 గంటల్లో అతి తీవ్ర తుపానుగా‌ మారనున్న నివర్

మరో 6 గంటల్లో నివర్ అతి తీవ్ర తుపానుగా‌ మారనుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీ. దూరంలో, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో నివర్‌ కేంద్రీకృతం అయింది. రేపు తెల్లవారుజామున మామల్లపురం-కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు.

12:42 November 25

చీరాల మండలం వాడరేవులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

12:19 November 25

నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు.. తమిళనాడు, పుదుచ్చేరి తీరప్రాంతాల్లో అలజడి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

తీవ్ర తుపాను నివర్‌ ప్రభావంతో రాష్ట్రంలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలపై తుపాన ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. బలమైన గాలులు వీస్తున్నాయి.

12:04 November 25

నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

నివర్ తుపాన్ ప్రభావంతో  నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకి నివర్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున వర్షం ఎక్కువవుతుందని.. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

12:02 November 25

నివర్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో వర్షాలు

నివర్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో ఈదుర గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. వాన కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది. భక్తులకు కనుమదారుల్లో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.

09:12 November 25

తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాను నివర్

గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న తుపాను నివర్

09:10 November 25

పుదుచ్చేరికి 310 కి.మీ. దూరంలో నివర్‌

పుదుచ్చేరికి 310 కి.మీ. దూరంలో నివర్‌ కేంద్రీకృతమైంది. కొద్దిగంటల్లో పెను తుపానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. రాత్రికి మామళ్లపురం- కరైకల్ వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ. మేర వర్షం పడినట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు.. కోస్తాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడుతోంది. తీర ప్రాంతాల్లో 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి.

09:09 November 25

సహాయ చర్యలకు సిద్దంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

నివర్ తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. మొత్తంగా.. తుపాను ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు.. 8 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం పంపించింది.

08:24 November 25

తుపానుపై ప్రకాశం జిల్లా అధికారులు అప్రమత్తం

నివర్ తుపాను దృష్ట్యా ప్రకాశం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ విజ్ఞప్తితో 30 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. తీర ప్రాంత మండలాల్లో 11 మంది ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ఆదేశంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారుల విధులు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

08:14 November 25

తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాను

తమిళనాడు తీరం వైపు తీవ్ర తుపాను నివర్ దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి 310 కి.మీ. దూరంలో నివర్‌ కేంద్రీకృతమైనట్లు ఐఎండీ వెల్లడించింది. కొద్దిగంటల్లో పెను తుపానుగా బలపడుతుందని అంచనా వేసింది. రాత్రికి మామళ్లపురం- కరైకల్ వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్ల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ. మేర వర్షం పడినట్లు  ఐఎండీ తెలిపింది. మరోవైపు.. కోస్తాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. తీర ప్రాంతాల్లో 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 145 కి.మీ. మేర గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. అలల ఎత్తు 3-5 మీటర్ల మేర ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది.

08:11 November 25

12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా‌ మారనున్న నివర్

నివర్ తుపాను.. 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా‌ మారనుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో కదులుతోంది. చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. రాత్రికి మామళ్లపురం-కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరందాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అధికారులు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అప్రమత్తం చేసింది.

08:10 November 25

నివర్ తుపాను ప్రభావంతో తిరుమలలో వర్షం

నివర్ తుపాను ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తోంది. వేకువజాము నుంచి ఈదురుగాలులతో వర్షం మొదలైంది. రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

08:07 November 25

నేడు పుదుచ్చేరిలో తీరం దాటనున్న నివర్‌

నేడు పుదుచ్చేరిలో నివర్‌ తుపాను తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలపైనా తుపాను ప్రభావం కనిపిస్తోంది. తుపాను తీరం తాకే సమయంలో 120-145 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రేపు, ఎల్లుండి తమిళనాడులోని కడలూర్‌, విల్లుపురం జిల్లాలు.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. దక్షిణ కర్ణాటకపైనా కొంతవరకు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.

08:02 November 25

నెల్లూరుకు 'నివర్' ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు

నివర్‌ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ తీరాన్ని తాకకపోయినా ప్రభావం ఉంటుందన్న అంచనాతో నష్టనివారణకు చర్యలు చేపట్టింది. నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ మేరకు తుపాను ప్రభావిత జిల్లాల యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 10మీటర్ల మేర సముద్రతీరం ముందుకు వచ్చింది.

Last Updated : Nov 25, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.