ETV Bharat / city

అనుకోని అతిథి.. సేవా సారథి..! - corona cases in andhra pradesh

ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉన్నా చివరి మజిలీ వేళ వారందరినీ దూరం చేస్తోంది కొవిడ్‌ మహమ్మారి. బాధితులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వెనుకాడుతున్నారు. అలాంటిది కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తుల చివరి మజిలీ పూర్తి చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు.

ngo's doing cremations for the corona deceased

author img

By

Published : May 10, 2021, 10:27 AM IST

కరోనా మహమ్మారి కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది.పాజిటివ్‌ వచ్చిందని తెలిసిన మరుక్షణం నుంచే ఇరుగుపొరుగు వారు కనీస సాయం చేయడానికి వెనుకాడుతున్నారు. కోలుకున్న తర్వాత కూడా మాట్లాడటానికి సంకోచిస్తున్న సమయమిది. వైరస్‌ సోకి ఓ కుటుంబంలో మరణం సంభవించిందని తెలిస్తే మృతదేహం తీసుకోవడానికి కూడా ముందుకు రాని కాలమిది. కొందరు కుటుంబ సభ్యులైతే ఆసుపత్రుల్లోనే మృతదేహాలను వదిలేస్తున్నారు. మరికొందరు దూరంగా నిలుచొని అయిన వారి అంత్యక్రియలను తిలకిస్తున్నారు. కుటుంబసభ్యులే కాదనుకున్నా కొందరు మాత్రం కరోనాతో చనిపోయిన వ్యక్తులకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.

తొలివేవ్‌లో 86..ఇప్పుడు 50

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా మొదట వైద్య శిబిరాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం ప్రారంభించాం. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు పుంగనూరు నుంచి వెళ్లి.. స్థానికులకు సాయం చేశాం. కరోనా తొలి వేవ్‌లో పుంగనూరుకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహాన్ని ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు చేస్తామని అప్పటి కలెక్టర్‌ భరత్‌గుప్తాకు విన్నవించాం. అనుమతులు రాగానే కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలి వేవ్‌లో 86, ఇటీవల మరో 50 మృతదేహాలకు అంత్యక్రియలు చేశాం. మా బృందంలో అన్వర్‌ బాషా, ఖదీర్, నజీర్, ఖమ్రుద్దీన్‌ తదితరులతో కలుపుకొని 25 మంది సభ్యులున్నారు. జిల్లాలో ఎక్కడికి వెళ్లైనా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దూరంగా నిలబడి చివరి చూపు చూస్తున్న మృతుల పిల్లలు, అమ్మానాన్నలు, జీవిత భాగస్వామిని చూస్తున్న సందర్భాల్లో ఒక్కోసారి కన్నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు కనీసం నాలుగైదు మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నాం. ఇప్పటివరకూ మా బృందంలో ఒక్కరికి కూడా మహమ్మారి సోకలేదు. 98498 89984 నంబరు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. - చాంద్‌ బాషా, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా

కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేస్తున్న కొవిడ్‌- 19 జేఏసీ యువత

ఇప్పటి వరకు 520 ఖననాలు, దహనక్రియలు

కొవిడ్‌ కేసులు వెలుగు చూసిన మొదట్లో.. కరోనాతో మృతి చెందిన ముస్లింలకు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మిత్రులైన సూరజ్, ఇమామ్, షరీఫ్, ఇమ్రాన్, ఖదిర్‌ తదితరులతో కలిసి కొవిడ్‌-19 జేఏసీగా ఏర్పడ్డాం. ప్రస్తుతం 60 మంది సభ్యులున్నాం. అప్పట్లో ఒకరోజు రుయా నుంచి ఓ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. తిరుపతికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. వారిని ఆరా తీయగా.. శవాన్ని తీసుకెళ్లనీయడానికి ఒప్పుకోవడంలేదని చెప్పారు. అప్పుడు వారిని ఓదార్చి.. వైద్యులతో మాట్లాడి ఆ హిందూ సోదరుడి అంత్యక్రియలు మేం చేస్తామని చెప్పాం. సేవ చేసే భాగ్యం కల్పించమని కోరడంతో డాక్టర్లు కూడా ఒప్పుకున్నారు. అలా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కరోనాతో మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియలు చేస్తున్నాం. ఇప్పటివరకూ 520కిపైగా ఖననాలు, దహన క్రియలు చేశాం. ప్రస్తుతం మా సేవను జిల్లా మొత్తం విస్తరించాం. గ్రామాలకూ వెళ్లి.. అంత్యక్రియలు పూర్తి చేస్తున్నాం. ఇందుకోసం చందాలు వేసుకొని అంబులెన్సులు కూడా కొనుగోలు చేశాం. ఈ పని చేస్తున్న తొలినాళ్లలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారని తెలిసి.. మా బృందంలోని కొందరిని బంధువులు ఇంటికి రానివ్వలేదు. ఆ తర్వాత మేం చేస్తున్నది మంచి కార్యక్రమమని తెలుసుకొని.. ఆదరాభిమానాలు చూపుతున్నారు. కొవిడ్‌ అంత్యక్రియలకు సంబంధించి 79953 77786 నంబరు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. - జేఎండీ గౌస్, కొవిడ్‌- 19, జేఏసీ

ఇదీ చదవండి: మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.