ETV Bharat / city

RAINS: కోస్తాంధ్రలో మూడురోజుల పాటు వర్షాలు! - ap rain latest news

కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

rain
rain
author img

By

Published : Aug 16, 2021, 8:59 AM IST

Updated : Aug 16, 2021, 9:37 AM IST

దక్షిణ ఒడిశా -ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించింది. రాగల 24 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఇవాళ్టి నుంచి 18 తేదీ వరకు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని సూచనలు జారీ చేసింది.

బెజవాడలో వర్షాలు..

విజయవాడలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. లోతట్టు కాలనీల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి మురుగు నీరు చేరడం వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

Last Updated : Aug 16, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.