ETV Bharat / city

నేటి నుంచి నూతన రేషన్​ కార్డుల పంపిణీ - new ration cards distribnution

రాష్ట్రంలో నూతన బియ్యం కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. 1.30 కోట్ల కుటుంబాలకు కార్డులు అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 15.5 లక్షల కుటుంబాలను అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. చిరగని.. నీటికి తడవని విధంగా కొత్త కార్డులు ఉంటాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ తెలిపారు.

నేటి నుంచి నూతన రేషన్​ కార్డుల పంపిణీ
నేటి నుంచి నూతన రేషన్​ కార్డుల పంపిణీ
author img

By

Published : Feb 15, 2020, 6:03 AM IST

రాష్ట్రంలో కొత్త బియ్యం కార్డుల పంపిణీ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు కార్డులను అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్​ కోన శశిధర్​ తెలిపారు. విద్యుత్​ బిల్లులు, ఇతర సమస్యల కారణంగా అనర్హత పొందిన 8 లక్షల కుటుంబాలకు చెందిన కార్డులను పునఃపరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వోద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించి 7.5 లక్షల కుటుంబాలను అనర్హులుగా గుర్తించామని చెప్పారు. 1.5 లక్షల కార్డులకు సంబంధించి చిరునామా అందుబాటులో లేకపోవడం వల్ల రెండోసారి తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లో కొత్త కార్డులిచ్చే ఏర్పాటు చేస్తామని శశిధర్​ చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా కార్డుల పంపిణీ జరుగుతుందని వివరించారు. దీనికి ఎవరికీ సొమ్ము ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఈ కార్డులపై క్యూఆర్​ కోడ్​, సహాయ కేంద్రం ఫోన్​ నంబర్​, కుటుంబ యజమాని ఫోటోతో పాటు తెలుగు, ఆంగ్లంలో వివరాలు ముద్రించారు. కొత్త కార్డులు చిరగని.. నీటికి తడవని విధంగా ఉంటాయని కమిషనర్​ తెలిపారు.

ఇదీ చూడండి:

'బిల్లుల్ని సెలక్ట్​ కమిటీకి పంపడం కుదరదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.