కొత్త నగర పంచాయతీల, పురపాలక సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు ఉండకపోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు, ఓటర్ల ముద్రణ ప్రక్రియ పూర్తి చేయనందున రెండోదశలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా పది పంచాయతీ, పురపాలక సంఘాలను ఏర్పాటు చేసి, వాటికి ఇటీవల ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే ఉన్న 110 పురపాలక, నగరపాలక సంస్థలతో కలిపి కొత్తగా ఏర్పాటైన వాటికీ ఎన్నికలు నిర్వహించాలని మొదట భావించారు. కొన్ని సాంకేతిక, చట్ట పరమైన సమస్యల కారణంగా చివరి క్షణంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కడప నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపైనా అధికారులు దృష్టి సారించారు. రిజర్వేషన్లు ఖరారు చేసేలోగా కేసులు పరిష్కారం కాకపోతే వీటితో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి :