ETV Bharat / city

డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్యాంశాలు - ఏపీ విద్యాశాఖ వార్తలు

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, ఉద్యోగావకాశాల కల్పనకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాల(సిలబస్‌)ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. తరగతి గది బోధనతోపాటు విద్యార్థులకు ప్రాక్టికల్‌ అనుభవం వచ్చేలా సిలబస్‌ను తీర్చిదిద్దారు.

new courses
new courses
author img

By

Published : Jul 14, 2020, 7:07 AM IST

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, ఉద్యోగావకాశాల కల్పనకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాల(సిలబస్‌)ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టనున్న పాఠ్యాంశాలను మంత్రి సురేష్‌ సోమవారం ఆవిష్కరించారు. తరగతి గది బోధనతోపాటు విద్యార్థులకు ప్రాక్టికల్‌ అనుభవం వచ్చేలా సిలబస్‌ను తీర్చిదిద్దారు. యూజీసీ సూచనలకు అనుగుణంగా డిగ్రీలో ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానాన్ని(సీబీసీఎస్‌) 2015-16లో ప్రవేశ పెట్టారు. మొదట్లో సీబీసీఎస్‌ పాఠ్యాంశాలున్నా క్రెడిట్‌ మార్పు అవకాశం విద్యార్థులకు కల్పించలేదు. తాజా సిలబస్‌లో ఈ మార్పు తీసుకొచ్చారు.

  • ఈ విద్యా సంవత్సరం నుంచి మొదటిసారిగా ఫలితాల ఆధారిత పాఠ్యాంశాలను తీసుకొచ్చారు.
  • ఫౌండేషన్‌ కోర్సుల స్థానంలో జీవన నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టారు. సెమిస్టర్‌కు ఒక కోర్సు చొప్పున 3సెమిస్టర్‌లకు మూడింటిని విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. నాల్గో సెమిస్టర్‌లో పర్యావరణ విద్య ఉంటుంది.
  • నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో మూడు సెమిస్టర్లలో నాలుగు కోర్సులను చదవాల్సి ఉంటుంది. రెండో సెమిస్టర్‌లో రెండు కోర్సులను తీసుకోవాలి.
  • చివరి ఏడాది ఐదో సెమిస్టర్‌లో నైపుణ్యాల పెంపుపై ఆరు కోర్సులు ఉంటాయి.
  • విద్యార్థులందరికీ 10నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ ఉంటుంది. ఇది మొదటి, రెండు ఏడాదుల్లో వేసవి సెలవుల్లో రెండు నెలలు చొప్పున ఉంటుంది.
  • విద్యార్థులు, కళాశాలలను సమాజంతో అనుసంధానం చేసేందుకు కమ్యూనిటీ సేవల ప్రాజెక్టును ఇంటర్న్‌షిప్‌లో భాగం చేశారు. మొదటి ఏడాది పూర్తయిన వెంటనే ఇది ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ కోర్సులు చేసేవారికి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌జీసీలో పాల్గొనే వారికి అదనంగా క్రెడిట్స్‌ ఉంటాయి.

ఇదీ చదవండి:

నామినేటెడ్‌ ఎమ్మెల్సీలుగా మోషేనురాజు, మర్రి రాజశేఖర్‌?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.