రాష్ట్రంలో కొత్తగా 3,892 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 28 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 7,67,465కి చేరగా..ఇప్పటి వరకు కరోనాతో 6,319 మంది మృతి చెందారు.
ఏపీలో ప్రస్తుతం 41,669 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 7,19,477 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 69,463 కరోనా పరీక్షలు నిర్వహించగా....మెుత్తంగా 67.72 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.