TDP DEEKSHA:తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెదేపా నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగానే దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. రెండున్నరేళ్లలో నిత్యం మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. మద్యపాన నిషధమంటూనే..పెద్దఎత్తున దుకాణాలు తెరిచారని అనిత మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్లో ధైర్యం నింపేందుకే సంకల్ప దీక్ష చేపట్టినట్లు ఆమె వివరించారు.
ఇదీ చదవండి: