ETV Bharat / city

'బీటెక్ విద్యార్థికి డ్రగ్స్ సరఫరా చేసింది లక్ష్మీపతి ముఠానే'

Narcotics‌ DCP On Laxmipathi Arrest: డ్రగ్స్ సరఫరాదారు లక్ష్మీపతి అరెస్ట్​పై తెలంగాణ నార్కోటిక్స్ విభాగం డీసీపీ చక్రవర్తి గుమ్మి మీడియా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుని చనిపోయిన బీటెక్ విద్యార్థికి మత్తుమందు సరఫరా చేసింది లక్ష్మీపతి గ్యాంగేనని డీసీపీ వెల్లడించారు.

Narcotics dcp chakravathygummi
Narcotics dcp chakravathygummi
author img

By

Published : Apr 6, 2022, 5:29 PM IST

Narcotics‌ DCP On Laxmipathi Arrest: డ్రగ్స్ సరఫరాదారు లక్ష్మీపతిపై ఇప్పటివరకు ఆరు కేసులున్నాయని తెలంగాణ నార్కోటిక్స్ విభాగం డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. లక్ష్మీపతి అరెస్ట్​పై డీసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల డ్రగ్స్‌ తీసుకుని బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ బీటెక్ విద్యార్థికి డ్రగ్స్ సరఫరా చేసిన లక్ష్మీపతి ముఠా అని పోలీసులు తేల్చారు. ఇంజినీరింగ్ విద్యార్థులను డ్రగ్స్ ముఠా ఎలా ట్రాప్ చేసిందనే వివరాలను డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాదారు లక్ష్మీపతి గత నేర చరిత్రను డీసీపీ వివరించారు.

'డ్రగ్స్‌ సరఫరాదారు లక్ష్మీపతి హాష్ ఆయిల్‌ విక్రయిస్తున్నాడు. 2016లో లక్ష్మీపతి 2 కేసుల్లో అరెస్టు అయ్యాడు. అతనిపై ఇప్పటివరకు 6 కేసులు ఉన్నాయి. గతంలో హాష్‌ ఆయిల్‌ కేసులో విశాఖలో లక్ష్మీపతి అరెస్టయ్యాడు. వంశీకృష్ణ, విక్రమ్‌ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించాం. నిందితుల వద్ద 840 గ్రాముల హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నాం. నిందితుల వద్ద రూ.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం. మదన్‌, రాజు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించాం. 5 గ్రాముల హాష్‌ ఆయిల్‌ విలువ రూ.3 వేలు, కిలో హాష్‌ ఆయిల్‌ విలువ రూ.6 లక్షలు ఉంటుంది. లక్ష్మీపతి వద్ద 18 మంది డ్రగ్స్‌ వినియోగాదారులు ఉన్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నాం. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. లక్ష్మీపతితో పాటు నగేశ్‌ కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. నగేశ్‌కు ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌ వినియోగదారులతో సంబంధాలు. ఒడిశా, తమిళనాడు, దిల్లీ, ముంబయి వినియోగదారులతో సంబంధాలున్నాయి.' -- చక్రవర్తి గుమ్మి, నార్కోటిక్స్‌ డీసీపీ

దర్యాప్తు వేగవంతం: అధిక మోతాదులో మాదక ద్రవ్యాలు సేవించి అనారోగ్యంతో మృతి చెందిన బీటెక్ విద్యార్థి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు... మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న కీలక నిందితుడు లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆంధ్రప్రదేశ్ నుంచి హాష్ ఆయిల్‌ సరఫరా చేసే నగేశ్‌ను ఆరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు వినియోగదారులను కూడా పోలీసుల అరెస్ట్ చేశారు. 840 గ్రాములు హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. గత వారం పెడ్లర్ ప్రేమోపాధ్యాయ్‌తో పాటు ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లక్ష్మీపతి కోసం గాంలించగా నిన్న ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడ్డాడు. అతని నుంచి రాబట్టిన ఆధారాలతో నగేశ్‌ను అరెస్ట్ చేశారు. నగేష్​ అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోగిలికి చెందిన వ్యక్తి. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 7కి చేరింది.

ఇవీచూడండి: Hyderabad Drug Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.