కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్‌ను తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా కీళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న గవర్నర్ సతీమణి ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఇదీ చూడండి: పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య