ETV Bharat / city

NARA LOKESH: 'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!' - ఏపీ తాజా రాజకీయ వార్తలు

అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడని పోలీసులు హింసించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఈ ఘటన చూస్తే వైకాపా పనైపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించారు.

NARA LOKESH TWEETED ON POLICE CASES OVER SOCIAL MEDIA
'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!'
author img

By

Published : Oct 27, 2021, 2:16 PM IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల నెపంపై పోలీసులు వృద్ధులను వేధించటం చూస్తుంటే... వైకాపా పనైపోయిందన్నది సుస్పష్టమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉగాండాలో ఉన్న ఓబుల్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే ఆయన తండ్రిని పోలీస్ స్టేషన్​కి పిలిచి హెచ్చరించి, హింసించారని ఆరోపించారు.

  • ఉగాండాలో ఉన్న కొడుకు ఓబుల్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే తండ్రి శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్ కి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, టార్చర్ చెయ్యడం పోలీసు వ్యవస్థని వైసీపీ నేతలు జేబు సంస్థగా మార్చుకున్నారు అనడానికి ఒక ఉదాహరణ.(2/2)

    — Lokesh Nara (@naralokesh) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా నేతలు పోలీసు వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకున్నారనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్​లో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీ చూడండి: నేరచరిత్ర ఉన్నవారిని నియమించడమేంటి..తితిదే బోర్డుపై హైకోర్టు ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.