వైకాపా పాలనలో అరాచకానికే తప్ప అభివృద్ధి, సంక్షేమానికి చోటు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఎస్సీ రైతులను వారి పొలాల్లోకి వెళ్లకుండా వైకాపా నేతలు రోడ్డు తవ్వేసిన ఘటనే ఇందుకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ పల్నాడు ప్రాంతంలో 127 ఎస్సీ కుటుంబాలను గ్రామాల నుంచి వెలివేశారని అన్నారు. సన్న, చిన్నకారు రైతులను తమ పొలానికి వెళ్లకుండా చెయ్యడమే జగన్ గారు తెచ్చిన స్వర్ణ యుగమా అని ట్విటర్లో నిలదీశారు. గ్రామాల్లో వైకాపా చేస్తున్న అరాచకాల ఫలితంగా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్రంలో పర్యటించిందని అన్నారు. రైతులను వేధించిన వారికి పుట్టగతులు ఉండవన్న విషయం జగన్ గుర్తు పెట్టుకోవాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: