దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే..పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంటే, వైకాపా నేతలకు చంద్రబాబుపై ఏడుపేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. సీఎం నుంచి మంత్రుల వరకూ, సలహాదారుల నుంచి వైకాపా ఎమ్మెల్యేల వరకు.. వారు సంపాదించిన అక్రమాస్తుల్లో మాత్రమే చంద్రబాబును బాధ్యుడ్ని చేయట్లేదని ఎద్దేవా చేశారు. ఇంధన ధరల భారం ప్రజలపై పడకూడదని 2018లో పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్‌ను రూ. 4 నుంచి 2 తగ్గించిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్‌తోపాటు లీటరుకి రూ. 4ల అదనపు వ్యాట్, మరో రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వడ్డించి.. లీటర్ పెట్రోల్‌పై 30 రూపాయలు సామాన్యులపై భారం మోపిన చరిత్ర జగన్‌రెడ్డిదని విమర్శించారు. ఇంధనం ధరలు వైకాపా పాలనలో ఎలా ఉన్నాయో సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడాలని హితవు పలికారు. ఏపీ కంటే తక్కువ ధరలనే బోర్డులు చూసైనా చంద్రబాబుపై ఏడుపు ఆపాలని అన్నారు.
వాళ్ల అక్రమాస్తుల్లో మాత్రమే చంద్రబాబును బాధ్యుడ్ని చేయట్లేదు: లోకేశ్
పెట్రోల్, డీజిల్ ధరలు.. రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే వైకాపా నేతలకు తెదేపా అధినేత చంద్రబాబుపై ఏడుపేంటని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఇంధన ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడాలని హితవు పలికారు.