ఇదీ చదవండి:
'రాజధానిపై మాట మార్చి... మడమ తిప్పిన జగన్' - జగన్ 30 వేల ఎకరాల వీడియో న్యూస్
మాట తప్పని, మడమ తిప్పని వంశమని చెప్పే ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడెందుకు మాట మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలు కావాలని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ట్వీట్ చేశారు.

నారా లోకేశ్
మాట మార్చే, మడమ తిప్పే వ్యక్తి... సీఎం జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో.. అన్ని ప్రాంతాల వారికి సమానదూరంలో ఉండాలని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం కనీసం 30 వేల ఎకరాలు కావాలన్న జగన్... ఇప్పుడెందుకు మాట మార్చారని నిలదీశారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి:
sample description