ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అన్నట్టు వైకాపా నేతల వైఖరి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మీడియా సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా నాయకుల మొహాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నిరసనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపరిచారని మండిపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైకాపా నాయకులు.. దాన్ని నిరూపించలేక చేతులెత్తేశారని దుయ్యబట్టారు. శాసనసభ సాక్షిగా అమరావతికి జైకొట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.
అమరావతి గ్రాఫిక్స్‌పై క్లారిటీ ఇస్తున్నా: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు
వైకాపా నేతల వైఖరిపై నారా లోకేశ్ ట్విటర్లో మండిపడ్డారు. అమరావతి కోసం ధర్నా చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం తగదని హితవు పలికారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న 'వైకాపా గ్రాఫిక్స్ నాయకుల' కోసం అమరావతి స్వరూపాన్ని చూపిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేశారు.