ETV Bharat / city

ఆయనకు తెలుసు.. ఇక్కడ ఎన్నికలుంటే గెలవరని: లోకేశ్

ప్రపంచంలో కరోనా వైరస్ అందరినీ భయపెడుతోంటే... ఏపీలో జగనోరా వైరస్ నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మూడు ముక్కల రాజధానితో అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.

nara lokesh on jagan
nara lokesh on jagan
author img

By

Published : Mar 9, 2020, 9:34 PM IST

ఏపీలో జగనోరా వైరస్ నడుస్తోంది: లోకేశ్

డిపాజిట్లే కాదు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉండరనే భయంతోనే సీఎం జగన్ రాజధాని ప్రాంతంలో ఎన్నికలు పెట్టలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా పెనుమాకలో అమరావతి కోసం ఉద్యమిస్తోన్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. 80 గంటలు నిరాహార దీక్ష చేసిన రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఒకే రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు పోరాడతామన్నారు. ఇడుపులపాయలో రాజధాని అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని... పోలీస్ స్టేషను ముఖం చూడని వ్యక్తులపై కేసులు పెట్టటం సరికాదని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని... అపుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా గూటికి డొక్కా మాణిక్య వరప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.